TG: 3 రోజుల పాటు భారీ వర్షాలు..!
NEWS Sep 21,2024 05:56 am
HYD: 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. 21న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 22న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 23న ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.