ఢిల్లీ యంగెస్ట్ సీఎంగా రికార్డు!
NEWS Sep 21,2024 05:48 am
ఆప్ నాయకురాలు ఆతిశీతో ఢిల్లీ 8వ సీఎంగా ఈ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ప్రమాణం చేయిస్తారు. గోపాల్, కైలాశ్, సౌరభ్, ఇమ్రాన్, ముకేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న అతి పిన్న వయస్కురాలు (43) ఆతిశీ. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తరువాత ఢిల్లీకి 3వ మహిళా సీఎం ఆతిశీ. ప్రస్తుతం దేశంలో మమతా బెనర్జీ ఒక్కరే మహిళా సీఎం కాగా, రెండో సీఎంగా ఆతిశీ.