ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో నిర్వహించే క్వాడ్ సమ్మిట్, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తారు. 3 రోజులు అమెరికాలో ఉండనున్న మోదీ ఎన్నారైలతో భేటీ కానున్నారు. ది సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్.. మానవాళి అభివృద్ధికి ప్రపంచ సమాజానికి ఒక అవకాశం అని మోదీ అన్నారు.