మూడు పీహెచ్సీలు మంజూరు
NEWS Sep 21,2024 05:02 am
సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేశారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్, రాయికోడ్ మండలం సింగీతం, మెదక్ జిల్లా పెట్టాలా మండలం ఎల్లుపేట్ లో పీహెచ్సీలు ఏర్పాటు కానున్నాయి. మూడు పీహెచ్సీలకి రూ. 7.35 కోట్ల నిధులను కేటాయించారు.