జగిత్యాల: తీవ్ర జ్వరంతో బాలుడు మృతి
NEWS Sep 21,2024 05:01 am
రాయికల్: జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన మనీశ్(6) జ్వరంతో మృతి చెందాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. మళ్లీ 2 రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు చేయించారు. డెంగ్యూగా నిర్ధారణ కావడంతో కుటుంబీకులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందాడు.