లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్
NEWS Sep 20,2024 07:04 pm
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. బాలాజీ మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమన్నారు. లడ్డూ కల్తీ జరిగిందనే విషయం ప్రతి భక్తుడినీ బాధపెడుతోందని పేర్కొన్నారు. మన దేశంలో అధికారులు మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలని సూచించారు.