మహిళా శక్తి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష
NEWS Sep 20,2024 06:59 pm
జగిత్యాల కలెక్టరేట్లో మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడానికి, అన్ని జీవనోపాధి అంశాలలో వారిని బలోపేతం చేయడానికి మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. మహిళా శక్తి కింద వచ్చే ఐదేళ్లలో మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ద్వారా ప్రణాళికలు రూపొందించబడ్డాయన్నారు.