జిల్లా స్థాయి పోటీలకు మల్యాల బాలురు
NEWS Sep 20,2024 07:00 pm
మల్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 22మంది విద్యార్థులు మండల స్థాయి కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జగిత్యాలలో ఈనెల 25 న జరగనున్న అండర్-17 విభాగంలో 12మంది విద్యార్థులు, 28న జరుగనున్న అండర్-14 విభాగంలో 10మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు అనుపమ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల పిఈటి విశ్వప్రసాద్, పాఠశాల చైర్మన్ రజిత, విద్యార్థులను అభినందించారు.