రూ. 320కే కిలో నెయ్యి: చంద్రబాబు
NEWS Sep 20,2024 05:47 pm
కిలో నెయ్యి చవకగా రూ.320కే వస్తోందని తిరుమల లడ్డూను కల్తీ చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. లడ్డూ కోసం నాసిరకం నెయ్యి వాడి, తిరుమల పవిత్రను దెబ్బతీశారన్నారు. ఎవరైనా కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా? అంటూ ఫైరయ్యారు. తాను తప్పు చేయలేదని, టెండర్లు పిలిచానని జగన్ చెబుతున్నారని, రూ.320కే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. పవ్రితమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని చంద్రబాబు విమర్శించారు.