సమతుల ఆహారం తీసుకోవాలి.
NEWS Sep 20,2024 06:32 pm
బాలికలు, గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణ్ మాస్ పై సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఎనిమియా నిర్ధారణ పరీక్షలపై ఆరా తీశారు.