గోదావరిలో గ్యాస్ పైప్ లైన్ లీక్
NEWS Sep 20,2024 06:16 pm
యానాం సమీపంలోని దరియాల తిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైపులైను నుండి లీక్ రావడంతో నీళ్ళు సుడులు లేపుతున్న దృశ్యంతో ప్రజలు భయబ్రాంతులకు గురి అయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఓఎన్జీసి, గెయిల్ ఇండియాతో పాటు చమురు సంస్థలు, గ్యాస్ సంస్థలు స్పందించకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని పలువురు అంటున్నారు.