ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవాలి
NEWS Sep 20,2024 06:13 pm
సిరిసిల్లలోని పాత బస్టాండ్ వద్ద రోజు ఇస్లాంపుర యూత్ ఆధ్వర్యంలో కీర్ పంపిణీ చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని కుల మతాలకు అతీతంగా సిరిసిల్ల 13వ వార్డు ఇస్లాంపుర యూత్ ఆధ్వర్యంలో యువకులు కీర్ పంపిణీ చేశారని అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుర్ర రాజు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్లాంపురం యూత్ సభ్యులు పాల్గొన్నారు.