సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీలో సైడ్ డ్రైనేజీ లలో మురికి నీరు నిలిచి ఉండడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ ఈవో పర్యవేక్షణ లోపంతో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుందని కాలనీవాసులు వాపోతున్నారు. పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.