సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలోని స్థానిక జడ్పీఎచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల రికార్డును తనిఖీ చేసి మధ్యాహ్న భోజన వంట తీరును పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై ఆరా తీశారు. వ్యక్తిగతంగా విద్యార్థులు సెల్ఫ్ గోల్ పెట్టుకోవాలని సూచించారు.సబ్జెక్టుల పైన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు సబ్జెక్టు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.