టైడ్స్ వార్షిక సమావేశానికి కలెక్టర్
NEWS Sep 20,2024 06:23 pm
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ (టైడ్స్) సొసైటీ లో వార్షిక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించగా, చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా టైడ్స్ లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లావాదేవీలు,ఎంత మందికి శిక్షణ ఇచ్చారో వివరాలపై చర్చించారు. గత ఏడాది మొత్తం 3,772 మందికి శిక్షణ ఇచ్చామని టైడ్స్ ప్రిన్సిపాల్ కలెక్టర్ కి తెలిపారు. 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులపై అడిగి తెలుసుకున్నారు.