23న కాశీ రాజు జిల్లా పర్యటన
NEWS Sep 20,2024 06:07 pm
బీజేపీ శ్రీకారం చుట్టిన సభ్యత్వ నమోదులో అభిమానులంతా తమ తమ పేర్లు నమోదు చేసుకుని పార్టీ బలోపేతానికి సహకరించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. ఆయన అమలాపురం కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. తమ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు జిల్లాలో పర్యటించానున్నారని తెలిపారు. ఈ నెల 23న ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేటలో పర్యటిస్తారన్నారు.