రాఘవపేటలో ప్రత్యేక మెడికల్ క్యాంపు
NEWS Sep 20,2024 04:57 pm
మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ ప్రత్యేక మెడికల్ క్యాంపులో జ్వరపీడితులను గుర్తించారు. 57 మందిని పరీక్షించి 9 మంది జ్వరపీడితులను గుర్తించి వారి నుండి రక్త నమూనాలను సేకరించారు. సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారిణి వాహిని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.