స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం
NEWS Sep 20,2024 06:24 pm
సంగారెడ్డిలోని మార్కెట్ లో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి వ్యాపారాలు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రశాంత్ నగర్ కాలనీలో ఇంటింటికి తిరిగి రోడ్లపై చెత్త వేయవద్దని వివరించారు. చెత్త బండిలోనే వేయాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్ పెక్టర్ సైదులు పాల్గొన్నారు.