బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలి
NEWS Sep 20,2024 06:26 pm
30 ఏళ్లకు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల కలెక్టరేట్లో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డెంగ్యూ బారిన పడకుండా గ్రామలలో ఫాగింగ్, శానిటేషన్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణులు నార్మల్ డెలివరీ అయ్యే విధంగా ప్రోత్సహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.