త్రిసభ్య కమిటీలో ఎమ్మెల్యేకు చోటు
NEWS Sep 20,2024 06:27 pm
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపైన స్టడీ చేయడానికి త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య అధ్యక్షతన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని పలు అసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందించనుంది.