ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత!
NEWS Sep 20,2024 06:32 pm
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వేయర్ల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూముల సర్వేకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. సర్వేయర్ల నియామకం లేకపోవడంతో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల్లో 14,287 సర్వే దరఖాస్తులు దరఖాస్తులు పెండింగ్ ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది