MLAని కలిసిన వెస్ట్ జోన్ ఏసీపీ
NEWS Sep 20,2024 06:34 pm
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదుని విజయవాడ వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్ఎస్వికె దుర్గారావు గొల్లపూడిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే కృష్ణప్రసాదుకి పుష్పగుచ్చాన్ని అందజేశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆయనకు సూచించారు.