గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు
NEWS Sep 20,2024 01:56 pm
దండేపల్లి మండలంలోని గూడెం, వెల్గనూర్ గ్రామాల్లో శుక్రవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రధాని మంత్రి మోదీ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలు ఎంతో అభివృద్ది చెందాయని పేర్కొన్నారు.