ఇది క్షమించరాని తప్పు: బండి
NEWS Sep 20,2024 01:42 pm
తిరుమల లడ్డూ ప్రసాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల పుణ్య క్షేత్రమని, తిరుమల లడ్డూను పవిత్రమైన ప్రసాదంగా భావిస్తున్నాంటారని తెలిపారు. ఈ లడ్డూను అపవిత్రం చెయ్యడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఇది క్షమించరాని అపరాధమని, వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలన్నారు. నిజాలను వెలుగులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.