ఎస్ఐగా షరీఫ్ బాధ్యత స్వీకరణ
NEWS Sep 20,2024 01:51 pm
దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఎస్సైగా షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం సాధారణ బదిలీలలో భాగంగా ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై నాగార్జునను బదిలీ చేసి ఆ స్థానంలో షరీఫ్ ను నియమించారు. ఈ సందర్భంగా ఎస్సై షరీఫ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కు నిరంతరం పని చేస్తానన్నారు. స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.