అధికారులు సమయపాలన పాటించాలి
NEWS Sep 20,2024 01:51 pm
అధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డ్స్ సరిగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం ధరణి సమస్యల దరఖాస్తులను పరిశీలించారు. అన్ని ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆఫీస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓ, డీపీఓ, తదితరులున్నారు.