ఆత్మనగర్ లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
NEWS Sep 20,2024 06:57 pm
మెట్పల్లి మండలంలోని ఆత్మ నగర్లో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి, పొడి, హానికర చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కార్య దర్శి నిజాముద్దీన్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు