తీరనున్న గల్ఫ్ కష్టాలు!
NEWS Sep 20,2024 06:43 pm
ఎట్టకేలకు గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్మికుల సమస్యలపై సలహా కమిటీ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల విద్యార్థులకు గురుకుల విద్యాలయాల్లో సీట్ల కేటాయింపుకు ప్రాధాన్యత, డిసెంబర్ 7, 2023 నుంచి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది. కాగా, ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లకు చెందిన యువత గల్ఫ్ బాట పట్టారు.