ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలి
NEWS Sep 20,2024 06:54 pm
ఆందోల్-జోగిపేట మున్సిపల్‌లో స్వచ్చతా హి సేవ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ.. మహిళలకు తడి పొడి చెత్తను వేరు చేయండంపై అవగాహన కల్పించారు. నిత్యం చెత్తను తడి పొడిగా వేరు చేసి మున్సిపల్ చెత్తబండిలో వేయాలని ప్రతి ఒక్కరు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శుభ్రమైన వాతావరణాన్ని కల్పించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యాన్ని కాపాడుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గణేష్ నిమజ్జనం పూర్తయిన సందర్భంగా చెరువులో చెత్త క్లీన్ చేశారు.