తహాశీల్ధార్ కార్యాలయాన్ని అకస్మికంగా
తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Sep 20,2024 01:54 pm
కథలాపూర్ మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మెట్ పల్లి ఆర్డీఓ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండల తహసిల్దార్ కార్యాలయానికి సంబంధించిన రికార్డ్స్ ఖచ్చితంగా నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు.అనంతరం ధరణి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చే అన్ని ఫిర్యాదులను వెంటనే పరిష్కార మార్గం చూపాలని అన్నారు. అధికారులు అందరు సమయపాలన పాటించి సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.