పిల్లల్లో పోషణ, గర్భిణీలు,
బాలింతల్లో రక్త హీనత నివారించాలి
NEWS Sep 20,2024 01:53 pm
పిల్లల్లో లోప పోషణ, గర్భిణీలు, బాలింతల్లో రక్త హీనత నివారించాలని మెట్ పల్లి ICDS సీడీపీఓ కే. మణెమ్మ అన్నారు. కోరుట్ల పట్టణంలోని సినారె కళాభవన్ లో మహిళా అభివృద్ది, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణమాస నిర్వహించారు. ఈ సందర్భంగా ICDS సీడీపీఓ కే. మణెమ్మ మాట్లాడుతూ.. ఐదేళ్ళ పిల్లల్లో లోప పోషణ, గర్భిణీలు, బాలింతల్లో రక్త హీనత నివారించి, పిల్లల్లో పోషణ స్థాయి పెంపు కోసం పని చేస్తూ పిల్లల్లో లోప పోషణను నివారించేందుకు ప్రజలకు పరిపూర్ణ అవగహన కల్పిస్తున్నామన్నారు.