డుంబ్రిగూడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
NEWS Sep 20,2024 06:54 pm
డుంబ్రిగూడ మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు టి. సుబ్బారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ముద్రించిన కరపత్రాలను గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయ ఉమ, ఎంపీటీసీ గీత టి.ఎన్.టి.యు.సి అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామి తదితరులు పాల్గొన్నారు.