లడ్డూ వివాదంపై హైకోర్టుకు జగన్
NEWS Sep 20,2024 07:47 am
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీ కోసం జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఖండిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఈ అంశంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. సుబ్బారెడ్డి తరపు లాయర్ సుధాకర్ రెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.