క్రీడాదుస్తులు పంపిణీ మాజీ MPTC
NEWS Sep 20,2024 07:49 am
సదాశివపేట మండలంలోని నిజాంపురం పాఠశాలోని విద్యార్థిని విద్యార్థులకు మాజీ ఎంపీటీసీ మాధవరెడ్డి తన సొంత డబ్బుతో జిల్లా స్థాయి క్రీడా పోటీలో ఎన్నికైన 40 మంది విద్యార్థిని విద్యార్థులకు, క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ.. కబడ్డీ, వాలీబాల్, కోకోలో జిల్లా స్థాయిలో ఎన్నికైన విద్యార్థిని విద్యార్థులకు డ్రెస్సులు పంపిణీ చేయడం సంతృప్తిగా ఉందన్నారు.