రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
NEWS Sep 20,2024 07:09 am
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ BRS ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ పిటిషన్ అపోహలపై ఆధారపడి దాఖలైందని, విచారణను ప్రభావితం చేశారనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. హైకోర్టును మార్చినా దర్యాప్తు సంస్థ అదే ఉంటుంది కదా? అని ప్రశ్నించింది.