కఠిన చర్యలు తీసుకుంటాం: పవన్
NEWS Sep 20,2024 05:18 am
తిరుమల లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై కలత చెందానన్న పవన్.. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆలయాల రక్షణపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు.