గేదెను ఢీకొట్టడంతో ఒకరు మృతి
NEWS Sep 20,2024 04:57 am
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదర్‌పల్లికి చెందిన పోచయ్య, సాగర్ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం గేదెను ఢీ కొట్టగా పోచయ్య సంఘటన స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సాగర్‌ను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.