ఆపరేషన్ థియేటర్లో మహిళ మృతి
NEWS Sep 20,2024 04:36 am
మల్యాల మండల కేంద్రానికి చెందిన వంగల మహిత(38) 3రోజుల క్రితం గర్భసంచి ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ జగిత్యాలలోని శాంతి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే గురువారము శస్త్రచికిత్స చేసేందుకు ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్ళిన కొద్దిసేపటికే హార్ట్ ఎటాక్ వచ్చి మహిళ మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు..ఇదిలా ఉండగా మత్తుమందు వికటించడంతోనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ చేరుకొని న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో మృతదేహాన్ని తీసుకొని వెళ్లిపోయారు.