వరిధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష
NEWS Sep 20,2024 04:37 am
జగిత్యాల: రాబోయే ఖరీఫ్ 2024-25 వరిధాన్యం కొనుగోలుకు సంభందించి వివిధ శాఖల అధికారులతో గురువారం జగిత్యాల కలెక్టరేట్లో కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. మద్దతు ధర క్వింటాకు గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 ధర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా ప్యాడి క్లీనింగ్ మిషన్స్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. టోకెన్ పద్ధతి పాటించాలని సూచించారు.