గల్ఫ్ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం
NEWS Sep 19,2024 05:08 pm
తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సెల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చిట్టి బాబును మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సెక్రెటేరియట్‌లోని మంత్రి కార్యాలయంలో సన్మానించారు. టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ బిఎం వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.