మూత్రశాలలు వినియోగంలోకి తీసుకురావాలి
NEWS Sep 19,2024 05:19 pm
సిరిసిల్లలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పోస్టుమార్టం గది వద్ద మూత్రశాల్ని స్వచ్ఛభారత్ లో నిర్మించారని, కానీ అవి ఎప్పటికీ తాళం వేసే ఉంటున్నాయని, ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యం కార్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై కమిషనర్ ని సంప్రదించిన వారి నుండి స్పష్టమైన సమాధానము రావడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కట్టిన మూత్రశాలల్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.