ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన
డిఐఈఓ వై. శ్రీనివాస్
NEWS Sep 19,2024 05:18 pm
సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిఐఈఓ వై.శ్రీనివాస్ సందర్శించి కళాశాల రికార్డులను, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అకాడమిక్ విషయాలను చర్చించి తరగతులను నిర్వహించాలని, అధ్యాపకులను ఉద్దేశిస్తూ మారుతున్న టెక్నాలజీ నేర్చుకొని విద్యార్థులకు విద్యాబోధన చేయాలని వారు కోరారు. ఎంసెట్ జేఈఈ ఎంట్రన్స్ లకు సంబంధించిన తరగతులను నిర్వహించాలని వై.శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె విజయ రఘునందన్, అధ్యాపకులు పాల్గొన్నారు.