పాఠశాలను సందర్శించిన కంచర్ల రవిగౌడ్
NEWS Sep 19,2024 05:17 pm
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల సందర్శనలో భాగంగా గురువారం రోజు సిరిసిల్లలోని 1వ వార్డు చంద్రంపేట ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో అధ్యాపక బృందంతో మాట్లాడి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల సందర్శించి విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకం బాగుందా లేదా అని, మెను ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. కార్యక్రమంలో మట్టే శ్రీనివాస్, కోడం వెంకటేష్, అరవింద్ పాల్గొన్నారు.