సాక్షికి ప్రభుత్వ నిధులు దోచిపెట్టారు
NEWS Sep 19,2024 04:14 pm
గత జగన్ ప్రభుత్వం సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెట్టిందని ఏపీ మంత్రివర్గం మండిపడింది. వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనిపించేందుకు 2 ఏళ్లలోనే ప్రభుత్వ ఖజానా నుంచి రూ.205 కోట్లు వెచ్చించారని చెప్పారు. జగన్ తన భార్య భారతి ఛైర్మన్గా ఉన్న పత్రిక సాక్షికి వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రకటనల రూపంలో రూ.443 కోట్లు దోచిపెట్టారని, మిగతా పత్రికలన్నింటికి ఇచ్చింది కలిపినా కూడా ఇంత లేదని తెలిపింది. విచారణ జరిపించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.