పవన్ కళ్యాణ్ ఇచ్చే పదవులివేనా?
NEWS Sep 19,2024 03:56 pm
వైసీపీ నుంచి కీలక నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను జనసేనలో చేరేందుకు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. పవన్ వారికి కీలక హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలక పదవులు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. బాలినేని, ఉదయభాను ఇద్దరికీ ఎమ్మెల్సీ అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 22న జనసేన పార్టీలో చేరబోతున్నారు.