డ్రగ్స్‌ను అరికట్టే బాధ్యత అందరిదీ
NEWS Sep 19,2024 05:13 pm
పటాన్‌చెరులోని డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంజీర విజ్ఞాన కేంద్రం ఎంవికే ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పటాన్‌చెరు డిఎస్పి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. డిఎస్పీ, ఏంవికే ఫౌండర్ సభ్యులు రాజయ్య, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కన్వీనర్ అర్జున్ లు మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకూడదని, జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు. డ్రగ్స్ సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలన్నారు.