ఏపీ వరద బాధితుల కోసం అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం రూ.25 కోట్లు అందిస్తున్నట్టు అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రీతి అదానీ ప్రకటించారు. తాజాగా సీఎం చంద్రబాబును కలిసిన అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25 కోట్ల విరాళం తాలూకు పత్రాలు అందించారు.