బీజేపీ అభ్యర్థిగా కేతని సావిత్రి నామినేషన్
NEWS Jan 30,2026 08:40 am
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో 7వ డివిజన్ నుంచి కేతని సావిత్రి కుమారి బీజేపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డివిజన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నిరంతరం సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి, పారదర్శక పాలనతో పాటు ప్రాథమిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.