ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ
NEWS Sep 19,2024 02:43 pm
మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాలు సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం ఈదుగాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి మాజీ మంత్రి డాక్టర్. ఏ. చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివాహం చేసుకున్న నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈదుగా నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.