అభివృద్ధి సంక్షేమ పథకాలు
అర్హులైన వారికి అందించాలి
NEWS Sep 19,2024 05:16 pm
అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జహీరాబాద్ ఎంపీ జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ శేట్కార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేయాలని కోరారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.